- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్వేశం, ప్రేమ మంటను రగిలిస్తాయి.. కొత్త సినిమా నుంచి డబుల్ అప్డేట్ ఇచ్చిన సోనమ్
యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా(Sonam Bajwa) ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా(Sonam Bajwa) ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అదే ఫామ్‌తో వరుస సినిమాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం సోనమ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఏక్ దివానే కి దీవానియాత్’(EkDeewaneKiDEEWANIYAT). ఇందులో హర్షవర్ధన్(Harsh Vardhan) సరసన రొమాన్స్ చేయనుంది. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ హైప్ పెంచగా.. అక్టోబర్ 2న విడుదల అవుతుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోనమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘ఏక్ దివానే కి దీవానీయత్’ మూవీ దీపావళి కానుకగా.. అక్టోబర్ 21న రాబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ చిత్రం టీజర్ ఆగస్టు 22న రాబోతున్నట్లు తెలుపుతూ ఫైరింగ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘‘ఈ దీపావళికి దీపాలే కాదు హృదయాలు కూడా మండుతాయి. ద్వేషం, ప్రేమతో మంటను రగిలిస్తాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇందులో లైటర్ ఆన్ చేసి ఉండగా మంటలు వస్తున్న హార్ట్ సింబల్‌లో హర్షవర్ధన్, సోనమ్ ఏడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.






