- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonam Bajwa: దసరా కానుకగా రొమాంటిక్ థ్రిల్లర్ రాబోతుందంటూ సోనమ్ పోస్ట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
యంగ్ బ్యూటీ సోనమ్ బాజ్వా(Sonam Bajwa) ‘పంజాబ్1984’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సోనమ్ బాజ్వా(Sonam Bajwa) ‘పంజాబ్1984’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు హిందీ, సినిమాల్లో నటించింది తన క్రేజ్‌కు పెంచుకుంది. ఇక తెలుగులో ఆటాడుకుందాం.. రా, బాబు బంగారం (Babu Bangaram )వంటి మూవీస్ చేసి ప్రేక్షకులను అలరించింది. వరుస సినిమాల్లో నటిస్తున్న సోనమ్ గత ఏడాది అమెజాన్ ప్రైమ్ చిత్రంతో వచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్న ‘హౌస్‌ఫుల్-5’ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 6న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ రొమాంటిక్ చిత్రాన్ని ప్రకటించింది. అయితే ఇందులో సోనమ్ బాజ్వా, హర్షవర్ధన్(Harshavardhan) హీరో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ టైటిల్‌తో రాబోతుంది. ముందుగా దీనికి ‘దివానియత్’ అని పేరు పెట్టగా.. పలు కారణాల వల్ల మార్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని మిలాప్‌మిలాన్‌జవేరి(Milap Milanjaveri) దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమాను వికిర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై అమూల్ మోహన్, అన్షు మోహన్ నిర్మిస్తున్నారు. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ (Ek Diwane ki Diwaniyat)మూవీ గాంధీ జయంతి, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2న విడుదల కాబోతున్నట్లు సోనమ్ వెల్లడించింది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో హర్షవర్ధన్ కళ్లలోంచి రక్తం కారుతుండగా ఎరుపు గులాబీని పట్టుకుని కనిపించగా.. సోనమ్ ఏడుస్తూ లైటర్‌తో ఆ పువ్వు కాల్చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






