పదేళ్లకు ప్రశంసలు అందుకున్న.. మళ్లీ అరంగేట్రం చేసినట్లు అనిపిస్తుంది

by Disha Web Desk 6 |
పదేళ్లకు ప్రశంసలు అందుకున్న.. మళ్లీ అరంగేట్రం చేసినట్లు అనిపిస్తుంది
X

దిశ, సినిమా: ఇటీవల వచ్చిన ‘దహద్‌’ సినిమాతో తాను మళ్లీ అరంగేట్రం చేసినట్లు భావిస్తున్నానంటోంది సోనాక్షి సిన్హా. మే 12న విడుదలైన ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సోనా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ సక్సెస్ అనుభవాల గురించి మాట్లాడింది. ‘నేను చివరిసారిగా 2013లో వచ్చిన ‘లూటెరా’ మూవీతో ప్రశంసించబడ్డాను. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ‘దహద్’తో అలాంటి పొగడ్తలు దక్కాయి. అంతేకాదు ఇన్నేళ్లుగా నాతో మాట్లాడని వ్యక్తులు కూడా.. నాకు ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపుతున్నారు. ఓ రెస్టారెంట్‌లో ఇందులో నా నటనకు ఫిదా అయ్యామని, ఆ క్యారెక్టర్‌లో నన్ను చాలా ఇష్టపడ్దామని చెప్పేందుకు జనాలు నన్ను చుట్టుముట్టారు. చాలామంది నా దగ్గరకు వచ్చి మెచ్చుకున్నారు’ అంటూ మురిసిపోయింది.

Read more: సెక్సీ లుక్స్‌లో సోనాల్..

Next Story