ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సోనాక్షి సిన్హా.. షాకింగ్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-06 13:42:14  IST  )

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సోనాక్షి సిన్హా.. షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ భామ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక ఇందులో ఆమె బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెంట్ అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రెగ్నెన్సీ వార్తలపై సోనాక్షి స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను ప్రెగ్నెంట్ కాలేదు. బరువు పెరగడానికి కారణం నా భర్త. జహీర్ ఇక్బాల్ నాకు రోజూ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు. అలా బయట ఫుడ్ తినడం వల్ల నేను బరువు పెరిగాను. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలి? అని నా భర్త అడుగుతాడు. జహీర్ దయచేసి నాకు తినిపించడం ఆపేయండి.

నేను బరువు పెరగడం వల్ల అందరూ నేను ప్రెగ్నెంట్ అయ్యానని అనుకుంటున్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ చెప్పుకొచ్చింది. దీంతో ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక సోనాక్షి సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఈ అమ్మడు ‘నిఖితా రాయ్’ (Nikhita Roy)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని కుష్ ఎస్ సిన్హా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అర్జున్ రాంపాల్ హీరోగా నటిస్తుండగా.. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నిక్కీ ఖేమ్‌చంద్ భగ్నాని(Nikki Khemchand Bhagnani), విక్కీ భగ్నాని, అంకుర్ తక్రాని, దినేష్ రతి రామ్ గుప్తా, కింజల్ అశోక్ ఘోన్ ,క్రాటోస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించారు. ఈ మూవీ జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. పలు కారణాల వల్ల ‘నిఖితా రాయ్’ మూవీ జూలై 18న రాబోతుంది.

Next Story