- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి ముంబై వీధుల్లో తిరిగిన స్టార్ నటి.. పేరెంట్స్ వద్దన్న వినలేదట
by Phanindra |
‘దహాడ్’లో తన బైక్ రైడింగ్ చూసి అమ్మనాన్నలు చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పింది సోనాక్షి సిన్హా.

X
దిశ, సినిమా : ‘దహాడ్’లో తన బైక్ రైడింగ్ చూసి అమ్మనాన్నలు చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పింది సోనాక్షి సిన్హా. ఈ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి అభిమానులను మెప్పించిన నటి.. ఇందులో తను చేసిన కొన్ని స్టంట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘యాక్షన్ ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాంటి కథల్లో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే ‘దహాడ్’లో బైక్ నడిపై సీన్ ఉందని తెలిసి షూటింగ్‌కు ముందే బండి కొన్నాను. దీంతో మా పేరెంట్స్ చాలా కంగారుపడ్డారు. బైక్ వేసుకుని రొడ్డు మీదకు వెళ్తే పడిపోతానేమోనని హడలిపోయారు. నేను మాత్రం అవేవి పట్టించుకోకుండా రాత్రంతా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టేదాన్ని. ఈ విషయం తెలుసుకున్న దర్శకురాలు రీమా.. సినిమాలో స్టంట్స్ చేయడం కంటే బండి నడిపే సీన్స్ బెటర్ అని నాకోసం మార్పులు చేసింది’ అంటూ వివరించింది సోనా.
Next Story






