వయ్యారాలతో మత్తెక్కిస్తున్న సోనాక్షి.. ఇన్ స్టాలో పిక్స్ వైరల్

by Disha Web |
వయ్యారాలతో మత్తెక్కిస్తున్న సోనాక్షి.. ఇన్ స్టాలో పిక్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది. ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లకు కనువిందు చేస్తుంది.

తాజాగా సోనాక్షి కుర్రాళ్ల కళ్లు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. స్టన్నింగ్ అనిపించేలా ఎల్లో డ్రెస్ లో సోనాక్షి వయ్యారాలు ఒలకబోసింది. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. దీంతో ఆమె త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్లబోతున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది.

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటాడు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది. త్వరలోనే వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంటి సచ్ దేవ్ సోనాక్షి ఫ్యామిలీకి చెందిన వాడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు.

Also Read..

కొంటెచూపుతో కాజల్ ట్రెండీ లుక్ అదరహో.. పిక్స్ వైరల్Next Story