‘సన్ ఆఫ్ సర్దార్-2’ విడుదల వాయిదా.. చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన టీమ్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.

‘సన్ ఆఫ్ సర్దార్-2’ విడుదల వాయిదా.. చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చిన టీమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ సర్దార్-2’(Son of Sardaar-2). విజయ్ కుమార్ అరోరా(Vijay Kumar Arora) దర్శకత్వంలో రాబోతుంది. ఇందులో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా రాబోతుంది. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని రిమేక్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో మూవీ మేకర్స్ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నారు. దీనిని అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, N R పచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించారు. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ విడుదలకు ఇంకా వారం ఉండగా.. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ సినీ ప్రియులకు షాకిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడినట్లు వెల్లడించారు. జులై 25న విడుదల కావాల్సిన మూవీని ఆగస్టు 1కి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అజయ్ దేవ్‌గణ్ అభిమానులు షాక్ అవుతున్నారు.

link

Next Story