సోషల్ మీడియాలో పిచ్చి నా కొడుకులంతా కలిసి బూతులు తిడుతున్నారు.. నాగవంశీ ఫుల్ ఫైర్ (వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) అందరికీ సుపరిచితమే. ఆయన వరుస సినిమాలు నిర్మించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో పిచ్చి నా కొడుకులంతా కలిసి బూతులు తిడుతున్నారు.. నాగవంశీ ఫుల్ ఫైర్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) అందరికీ సుపరిచితమే. ఆయన వరుస సినిమాలు నిర్మించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం నాగవంశీ, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా చేస్తున్న ‘కింగ్‌డమ్’(Kingdom) చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి(Goutham Tinnanuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు నాగవంశీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఓ భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ నెట్టింట పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ట్విట్టర్ లో పిచ్చి నా కొడుకులంతా చేరి మాకు 10 రూపాయిలకి అది వస్తుంది 50 రూపాయిలకి ఇది వస్తుంది సినిమా ఎందుకు రాట్లేదు అంటున్నారు. ట్విట్టర్‌లో పిచ్చి పిచ్చిగా పెట్టడం ఈజీ. మూడు గంటలు పాటు ఫ్యామిలీతో కలిసి నీకు నచ్చిన సినిమాను థియేటర్స్‌లో చూసుకో. నీకు నచ్చినపాటలు చూస్తున్నావ్. ట్విట్టర్‌లో ఎవరు ఎంత నన్ను తిట్టినా సినిమా అనేది ప్రపంచంలో చాలా చీప్. ఇద్దరు ఫ్రెండ్స్ కుర్చుని చిత్రాల గురించి మాట్లాడుకుంటారు. అదేదో సినిమా చూసి తిట్టొచ్చు కదా. థియేటర్స్‌లో కాకుండా పైరసీలో చూసి మమ్ములను తిడుతున్నారు. ఎలాగూ తిడుతున్నారు.. టికెట్ కొని తిట్టండి’’ అని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

link

Next Story