మెగా ప్రిన్స్‌కు జోడీగా మిస్ యూనివర్స్..

by Disha Web Desk 13 |
మెగా ప్రిన్స్‌కు జోడీగా మిస్ యూనివర్స్..
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ బిగ్గెస్ట్ మూవీ ని అనౌన్స్ చేసింది సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్.కాగా యథార్థ సంఘటనల ప్రేరణగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘#VT13’ నుంచి మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ తేజ్ భారతీయ వైమానిక దళ పైలట్‌గా కనిపించనుండగా.. ఆయనకు జోడిగా మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్‌ను సెలక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పిన మానుషి.. ‘యాక్షన్‌తో నిండిన సినిమాలో భాగమైనందుకు.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన చిత్ర దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా కి కృతజ్ఞతలు. వరుణ్ తేజ్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’ అని చెప్పుకొచ్చింది. శక్తి ప్రతాప్ సింగ్, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ కథ అందించిన చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది.

ఇవి కూడా చదవండి : బ్రా ధరించిన పురుషులు.. అమ్మాయిల కంటే వీళ్లే బెటర్ అంటూ..!

Next Story

Most Viewed