'మహారాణి' షూటింగ్ స్పాట్ ఒక పిక్నిక్ లాంటిది: సోహమ్ షా

by Disha Web Desk 22 |
మహారాణి షూటింగ్ స్పాట్ ఒక పిక్నిక్ లాంటిది: సోహమ్ షా
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సోహమ్ షా సినిమా షూటింగ్‌ను ఒక పిక్నిక్‌లా భావిస్తానంటున్నాడు. తాజాగా విడుదలైన 'మహారాణి సీజన్ 2' పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా ఓ చానల్‌తో మాట్లాడుతూ చిత్రీకరణ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 'మహారాణి సెట్ నాకు ఎప్పుడూ విహారయాత్ర లాంటిది. మొదటి సీజన్ చేసినప్పటి నుంచి అందరితో మంచి అనుబంధం ఏర్పడింది. హ్యూమా, అమిత్, సుభాష్ కపూర్ ఇతరులతో కలిసి పనిచేయడాన్ని ఆనందించాను. శీతాకాలంలో భోపాల్‌ లాంటి అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. సెట్స్‌లోకి కొత్త ముఖాలు వచ్చినపుడు మరింత శక్తి పుట్టుకొస్తున్నట్లు ఫీల్ అవుతాను. మూవీ టీమ్ మొత్తం ఎలాంటి తారతమ్యాలు లేకుండా సరదాగా గడిపాం. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులతో మళ్లీ మళ్లీ కలిసి పని చేయడం కాస్త బోర్ అనిపించినప్పటికీ వాళ్లు పోషించే పాత్రలు మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తాయి' అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed