జైలులో డ్యాన్స్ చేసిన Rhea Chakraborty ..

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-19 14:17:17  IST  )

Rhea Chakraborty was kept in special cell in 2020, danced with inmates on last day

జైలులో డ్యాన్స్ చేసిన Rhea Chakraborty ..
X

దిశ, సినిమా : హీరోయిన్ రియా చక్రవర్తి బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ డెత్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులు జైలులో గడిపిన ఆమె.. చివరి రోజున ఇన్‌‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేసినట్లు సోషల్ యాక్టివిస్ట్ సుధా భరద్వాజ్ తెలిపింది. స్టార్ అనే ఇగో లేకుండా జైలులో అందరితో కలిసిపోయినట్లు చెప్పింది. అలాంటి అమ్మాయిని మీడియా, సోషల్ మీడియాలో నెగెటివ్‌గా చిత్రీకరించడం చూసి బాధపడ్డామని, కానీ ఈ ఘటనను రియా స్పోర్టివ్‌గా తీసుకుందని వివరించింది. జైలు నుంచి వెళ్లే రోజున తన బ్యాంక్ ఎకౌంట్‌లో మిగిలిన డబ్బుతో అందరికీ స్వీట్లు పంచిపెట్టినట్లు చెప్పింది. అందరి కోరిక మేరకు డ్యాన్స్ చేసినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : 'XXX' సిరీస్‌లో బూతు పురాణం.. అయినా నిర్మాతకు..

ఇవి కూడా చదవండి : అలియా ప్రసవం.. రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Next Story