నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. లిమిటెడ్ ఎడిషన్ వచ్చేస్తుందంటూ షాకింగ్ పోస్ట్.. దాని ధర ఎంతంటే?

by Mallepaka Hamsa |

సినీ సెలబ్రిటీల కోసం అభిమానులు ఎలాంటి పని చేయడానికైనా వెనకాడరు.

నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. లిమిటెడ్ ఎడిషన్ వచ్చేస్తుందంటూ షాకింగ్ పోస్ట్.. దాని ధర ఎంతంటే?
X

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీల కోసం అభిమానులు ఎలాంటి పని చేయడానికైనా వెనకాడరు. అలాగే హీరోహీరోయిన్లు సైతం తమ అభిమానుల డిమాండ్‌ను తీరుస్తూ వారిని సంతోషపెడుతుంటారు. తాజాగా, హాలీవుడ్ నటి కూడా అభిమానుల కోరిక మేరకు ఓ విచిత్రమైన పని చేసి అందరికీ షాకిచ్చింది. తన ఫ్యాన్స్ కోసం స్నానం చేసిన నీటిని నిల్వ చేసి మరీ వాటితో సబ్బు తయారు చేయించింది. ఈ విషయం వినడానికి వింతగా ఉన్నా నిజమేనండోయ్. తయారు చేయించడమే కాకుండా ఈ సబ్బును ‘సిడ్నీస్ బాత్ వాటర్ బ్లిస్’(Sydney Bath Water Bliss) అనే పేరుతో ఆన్‌లైన్ అమ్ముడానికి కూడా సిద్ధమైపోయింది. ఆమె మరెవరో కాదు.. హాలీవుడ్ నటి సిడ్నీ స్వీని(Sidney Sweeney) 2009 నుంచి ఇండస్ట్రీలో రాణిస్తుంది.

బోల్డ్ పాత్రలకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ భామ ఎన్ని చిత్రాల్లోనూ నగ్నంగాను నటించి అందరికీ బిగ్ షాకిచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు సబ్బుల బిజిసెన్ స్టార్ట్ చేయనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘సిడ్నీ బాత్ వాటర్ బ్లిస్‌ను పరిచయం చేస్తున్నాము! నా నిజమైన బాత్ వాటర్‌తో తయారు చేసిన చాలా నిజమైన, చాలా పరిమిత ఎడిషన్ సబ్బు. 6/6/25న drsquatch.comలో అందుబాటులో ఉంది.

అయితే ఈ ప్రకటన తర్వాత మీరు నా బాత్ వాటర్ గురించి అడుగుతూనే ఉన్నారు. కాబట్టి మేము దానిని అలాగే ఉంచాము’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ సబ్బులు కేవలం 5000మాత్రమే తయారు చేశారట. ఇక ఒక్కదాని ధర 8 డాలర్లు అని సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 700. ఇక నటి పోస్ట్ చూసిన నెటిజన్లు ఎగిరిగంతేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సిడ్నీ ‘అమెరికానా’(Americana) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టోనీ టోస్ట్(Tony Toast) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మెక్‌క్లార్నన్, సైమన్ రెక్స్(Simon Rex), ఎరిక్ డేన్, హాల్సే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక షూటింగ్ మూడేళ్ల క్రితమే పూర్తి చేసుకోగా.. ఆగస్టు 22న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story