అల్లు అర్జున్‌కు స్పెషల్ సర్‌ప్రైజింగ్ ఇచ్చిన స్నేహా రెడ్డి తండ్రి

by Disha Web Desk 9 |
అల్లు అర్జున్‌కు స్పెషల్ సర్‌ప్రైజింగ్ ఇచ్చిన స్నేహా రెడ్డి తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లోరాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్నాడు. అయితే బన్నీ అవార్డు తీసుకుని హైదరాబాదుకు తిరిగి వచ్చాక తన భార్య, అలాగే మామ చంద్రశేఖర్ రెడ్డి స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో కుటుంబ సభ్యులు, పుష్ప సినిమా నుంచి మెయిన్ యూనిట్‌, అలాగే పలువురు సన్నిహితులు, బన్నీ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : అలాంటి వారిని నిర్లక్ష్యం చేయకంటూ నటి హరితేజ పోస్ట్.. నెట్టింట మొదలైన చర్చలు



Next Story

Most Viewed