శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో స్మృతి ఇరానీ.. భయంగానే నటించిందట!

by Disha Web Desk 9 |
శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో స్మృతి ఇరానీ.. భయంగానే నటించిందట!
X

దిశ, సినిమా: శానిటరీ ప్యాడ్స్ ప్రకటనలో నటించడంపై నటి, ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టెలివిజన్ హిట్ షో ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’తో గుర్తింపు పొందటానికి ముందు ఓ శానిటరీ బ్రాండ్ కోసం నటించిన వీడియోను షేర్ చేసింది. ‘నిజానికి ఒక గ్లామర్ ఆధారిత మోడల్‌కు కెరీర్‌ను కిల్ చేసే ఇలాంటి నిర్ణయం సవాలుతో కూడినదే. ఎందుకంటే ఆ రోజుల్లో ప్యాడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం నిషిద్ధం. దీంతో ఒక పెద్ద కంపెనీ ప్రకటనను చేయడానికి చాలామంది విముఖత చూపారు. కానీ, కెమెరా ముందు నా పనిని ప్రారంభించాలనే ఆత్రుతతో నేను ఓకే చెప్పాను. 25ఏళ్ల క్రితం నేను చేసిన పని గురించి జనాలు చాలా గుసగుసలాడారు. అయితే అవకాశం తర్వాత నేను వెనుకకు చూడలేదు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు’ అంటూ రాసుకొచ్చింది మహిళా & శిశు అభివృద్ధి అండ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి.



Next Story

Most Viewed