- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లామర్ మోజులో గాడితప్పినట్లు అనిపిస్తోంది.. రూటు మార్చేస్తానంటున్న జాన్వీ
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తాను మరింత వైవిధ్యమైన కథల్లో నటించాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తాను మరింత వైవిధ్యమైన కథల్లో నటించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన నటనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే విలక్షణ నటిగా నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. సాంప్రదాయ పాత్రలు అపారమైన ప్రజాదరణను పొందగలవని తెలుసు. అయితే నటిగా నా పరిధిని విస్తరించడంతోపాటు నటనా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు సవాలు చేసే పాత్రలను ఎంచుకోవాలనుంది. బాధలు, ఏడుపు క్యారెక్టర్లలో మెప్పించాను అని భావిస్తున్నా. అందుకే ప్రజలను మరింత ఆకర్షించేందుకు ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా కామెడీ క్యారెక్టర్లకోసం వేయిట్ చేస్తున్నా. స్క్రీన్‌పై అందంగా కనిపిస్తూ మంచి డ్యాన్స్ చేస్తున్నప్పటికీ ఎక్కడో సహజమైన నటనను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతోంది’ అంటూ పలు విషయాలు షేర్ చేసుకుంది జాన్వీ.






