- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ యాక్షన్ మోడ్‌లో శివకార్తీకేయన్.. అంచనాలు పెంచుతున్న ‘మదరాసి’ ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ (Siva Karthikeyan)గత ఏడాది ‘అమరన్’తో హిట్ అందుకుని ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ (Siva Karthikeyan)గత ఏడాది ‘అమరన్’తో హిట్ అందుకుని ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. ‘మదరాసి’ (madharaasi)టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు చాలా రోజులుగా హిట్ లేక సతమతమవుతున్న ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తోంది. విద్యుత్ జమాల్ విలన్‌గా కనిపించనుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టె్ంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు హైప్ పెంచాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈక్రమంలో.. తాజాగా, ‘మదరాసి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో శివ కార్తీకేయన్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరిలో అంచనాలను పెంచుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఈ సారి ఎలాగైనా ఏఆర్ మురుగదాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని కామెంట్లు పెడుతున్నారు. అలాగే శి కార్తీకేయన్ యాక్టింగ్ అదుర్స్ అని అంటున్నారు.






