బిగ్‌బాస్‌‌లో రెచ్చిపోయిన శివాజీ.. బీపీ చెక్ చేసి కప్పు కాఫీ ఇచ్చిన కంటెస్టెంట్స్!

by Disha Web Desk 9 |
బిగ్‌బాస్‌‌లో రెచ్చిపోయిన శివాజీ.. బీపీ చెక్ చేసి కప్పు కాఫీ ఇచ్చిన కంటెస్టెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్-7 లో హీరో శివాజీ తాజాగా ఫుల్ ఫైర్ అయ్యాడు. టాస్క్‌లు జరుగుతున్న సమయంలోనే నేను జనాల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చాను. వాళ్ల కోసమే పనిచేస్తాను. ఎందరితోనో పని చేశాను. ఇప్పుడు ఈ షోకు వస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వరా అంటూ బిగ్ బాస్‌కే వార్నింగ్ ఇచ్చారు. నాకు కాఫీ ఇస్తేనే ఇంట్లో ఏదైనా తింటాను. లేదంటే ఇలాగే ఉంటాను అని మంకు పట్టు పట్టాడు. ఈ హీరో అరుపులకు డాక్టర్ అవతారం ఎత్తిన రతిక చాలా భయపడిపోయింది.

రతిక హౌస్‌లోని మిగతా సభ్యులు ఎంత చెప్పినా వినకుండా శివాజీ.. కాఫీ ఇస్తే గేట్లు ఓపెన్ చేస్తావా? ఈ క్షణమే వెళ్లిపోతాను. శివాజీగాడు పీకినాడని జనం అనుకున్న పర్లేదు నేను వెళ్లిపోతా.. పచ్చి మంచి నీళ్లు కూడా ఇక్కడ తాగను అంటూ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ చాలా సేపు వెయిట్ చేయించి.. బిపీ చెక్ చేసి, శివాజీని ఒక రూమ్‌లోకి పిలిచి కప్పు కాఫీ ఇచ్చి అతడ్ని కూల్ చేసి మరీ పంపాడు.

Read More: హీరోయిన్ అంజలి సినిమాలో ఒరిజినల్ గొరిల్లా!

Next Story