- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాడీ స్టైల్ కాపీ కొట్టిన సితార.. అందరినీ కట్టిపడేసిందిగా!(వీడియో)
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. అంతే కాకుండా ఏదోఒక కాన్సెప్ట్‌తో నెట్టింట్లో

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. అంతే కాకుండా ఏదోఒక కాన్సెప్ట్‌తో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటది. ఇక ఇటీవల గుంటూరు కారం మూవీ విడుదలై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
మహేష్ బాబు మాస్‌లుక్‌లో కనిపించి అదరహో అనిపించాడు. కాగా, ఈ మూవీని మహేష్ బాబు గారాల పట్టీ సితార , ఆర్ఫాన్‌కు చెందిన పిల్లలతో మరోసారి వీక్షించింది.దర్శకుడు వంశీ పైడిపల్లి,మెహర్ రమేష్ కూతురు, అనాధపిల్లలతో సితార ఏఎంబీసినిమాస్‌కు వచ్చి గుంటూరు కారం మూవీ మళ్లీ చూసింది. అయితే థియేటర్‌కు వచ్చిన సితారా స్టైలిష్ లుక్‌లో అందరినీ కట్టిపడేసింది. గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ ధరించి అందరి చూపు తన వైపే తింపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ , వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ సితార మహేష్ బాబు స్టైల్ కాపీ కొట్టిందంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.






