- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తగిన పారితోషికం లభించదు.. పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ సింగర్ ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్(Kanika Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్(Kanika Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బేబీ డాల్(Baby doll), చిట్టికలయ్యా(Chittikalayya) వంటి సాంగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి తన గొంతులో అందరినీ మంత్రముగ్దులను చేసింది. బాలీవుడ్‌లో వరుస హిట్ సాంగ్స్‌తో పాపులారిటీని పెంచుకుంటోంది. తాజాగా, ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న కనిక ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్‌కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్‌లో కేవలం రూ.110 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు.
నాకు చాలా కోసం వచ్చింది. కానీ కేవలం అలా నాకు ఒక్కదానికే జరగలేదు. స్టార్ హోదాలో ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్‌కు లైవ్ కన్సర్ట్స్‌తో మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు ప్రదర్శన ఇచ్చేంతవరకు చేతినిండా సంపాదిస్తూనే ఉండొచ్చు. మాకు ఏదైనా జరిగితే ఇండస్ట్రీలో పెన్షన్ పథకం కూడా లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.






