హీరోగా సింగర్ సునీత కొడుకు.. కల సాకారమైందంటూ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
హీరోగా సింగర్ సునీత కొడుకు.. కల సాకారమైందంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సింగర్ సునీత తన పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన పాపులారిటీని దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ‘సర్కార్ నౌకరీ’ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ కంగ్రాట్స్ ఆకాశ్.. ఆ రోజు ఒక కుమారుడితో పాటు తల్లి కల కూడా సాకారమైంది. ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను తెలియజేయడంతో పాటు నటుడిగా ఎదగాలన్న కలను సాకారం చేసుకున్నావు. దానికోసం నువ్వు పడిన శ్రమ, యాక్టింగ్ పట్ల నీకున్న ఆసక్తి నిబద్ధత, నీ త్యాగాలకు ఈ పోస్టర్ అద్దం పడుతోంది. సినిమాల పట్ల నీకున్న ఆసక్తిని ఈ ప్రపంచం త్వరలోనే చూడనుంది. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ రాసుకొచ్చింది.

Read More..

అందం కోసం కీర్తీ సురేష్ అలాంటి పని చేస్తుందా?




Next Story

Most Viewed