మనసంత గుబులుగా అనిపిస్తుంది: సునీత వీడియో వైరల్

by Disha Web Desk 23 |
మనసంత గుబులుగా అనిపిస్తుంది: సునీత వీడియో వైరల్
X

దిశ, సినిమా : ‘రంగమార్తండ’ సినిమా చూస్తే గుండె బరువెక్కిందని తెలిపింది సింగర్ సునీత. తాజాగా ‘రంగమార్తండ’ స్పెషల్ షో చూసినట్లు తెలిపిన సునీత.. ‘ఒక సినిమాలో మూడు క్యారెక్టర్స్.. ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం పర్ఫార్మెన్స్‌ చూస్తే నా గుండె బరువెక్కింది. మనసంత గుబులుగా అనిపిస్తుంది. ఇలాంటివి రెగ్యులర్‌గా ఉంటే బయటపడేందుకు రకరకాల మార్గాలు వెతుకుతుంటాం. కానీ, నాకు మాత్రం ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉన్నా అందులో ఉండిపోవాలనిపిస్తోంది. అలాంటి గొప్ప ప్రతిభను నటీనటుల నుంచి తీసుకురావడం కృష్ణవంశీకే సాధ్యం. ఈ సినిమాలో మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి:

కంగనతో ఎలాంటి సమస్య లేదు.. ఆమె కోరికలే ‘చీప్’

Next Story