డైరెక్టర్ చేసిన పనికి షాకైన సింగర్ సునీత.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?

by Jakkula Samataha |

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

డైరెక్టర్ చేసిన పనికి షాకైన సింగర్ సునీత.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. శ్రీరామ రాజ్యం చిత్రం డబ్బింగ్ సమయంలో తనకు ఓ డైరెక్టర్‌తో ఎదురైన ఇన్సిడెంట్ గురించి ఓపెన్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ.. బాపు డైరెక్టర్ అంటే చాలా మందికి మంచి అభిమానం ఉంటుంది. ఆయన వస్తున్నారంటే చాలు ప్రతి ఒక్కరూ లేచి నిలబడి గౌరవిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి, ఒక రోజు నేను డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ రూమ్‌కు వెళ్లాను. ఆ సమయంలో బాపుగారు అక్కడ ఏదో రాసుకుంటున్నారు. నన్ను చూడగానే లేచి నిలబడి నమస్కరించారు . నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. దీంతో అది చూసిన బాలకృష్ణ, అది బాపు గారు నీ కలకు, విద్యకు ఇస్తున్న సంస్కారం అని తెలిపారు. అంతే కాకుండా ఆయన నుంచి నేను ఆటో గ్రాఫ్ తీసుకోగా, నీ వీరాభిమాని బాపు అని రాశారు. అసలు ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. అంత గొప్ప వ్యక్తి నాకు నమస్కరించడంతో నేను షాక్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ చూసి బాలు గారు కూడా కుళ్లు కున్నారు. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story