45 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్.. సింగర్ సునీతపై మండిపడుతున్న ఫ్యాన్స్!

by Disha Web Desk 8 |
45 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్.. సింగర్ సునీతపై మండిపడుతున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : ప్రముఖ సింగర్ సునీతకు సంబంధించిన న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమె రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి , సునీత ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. గతంలో సింగర్ సునీత మామిడి కాయతో ఫోటో దిగి షేర్ చేయడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయంపై స్పందించిన ఆమె అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది. నేను ప్రెగ్నెంటా.. నాకే తెలియదు. ఈ రూమర్ పుట్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించినది, అసలు కొందరు జీవితాలతో ఆడుకుంటారు. రూమర్స్ క్రియేట్ చేసేటప్పుడు కనీసం ఆలోచించరా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఇక కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఇలాంటి రూమర్స్ మొదలయ్యాయి. 45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ ట్రోలర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ప్రెగ్నెంట్ కాదు అని ఎన్నో సార్లు చెప్పి, వచ్చిన వార్తలను ఖండించినా ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వార్తపై సునీత ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

Read More : ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్‌లో ఫ్యాన్స్?

Next Story

Most Viewed