మీది ఫేక్ నవ్వు.. ఘాటుగా ఇచ్చిపడేసిన సింగర్ సునీత

by Disha Web Desk 9 |
మీది ఫేక్ నవ్వు.. ఘాటుగా ఇచ్చిపడేసిన సింగర్ సునీత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి సుపరిచితమే. గులాబీ సినిమాలో ‘ఈ వేళలో నీవు’.. మహేష్ బాబు నటించిన మురారీ మూవీలో ‘అలనాటి రామచంద్రుని’ సాంగ్స్‌ పాడి తన గానంతో ప్రేక్షులందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పటికి కూడా పాటలు పాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ మూడేళ్ల క్రితం రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నాక తన వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్ మొదలయ్యాయి. తాజాగా సునీత ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలను పంచుకున్నారు. ‘‘వ్యక్తిగత జీవితం గురించి రికార్డింగ్ స్టూడియోలో చర్చించాల్సిన అవసరం లేదని, వృత్తిపర జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరని అన్నారు.

గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్లినట్లుగానే, స్టూడియోలోకి కూడా వెళ్తానని తెలిపారు. మీరు రిలేషన్‌లో ఉన్నారా?, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది?, మీ దగ్గర మనీ ఉందా? అని ఇలాంటి ప్రశ్నలకు అక్కడ తావుండదన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారందరినీ పక్కకు నెట్టి.. ముందుకెళ్తేనే స్టూడియోలో సంతోషంగా ఉంటామన్నారు. నేను చాలా సెన్సిటివ్. ప్రతిదానికీ కన్నీళ్లు పెట్టుకుంటానన్నారు. ఏడవకపోతే తాను అర్టిస్ట్‌ను ఎలా అవుతానని ప్రశ్నించారు. ఇక తన నవ్వును చాలా మంది ఫేక్‌గా ఉంటుందని కామెంట్ చేశారని.. నేను ఎప్పుడు ఎలా నవ్వాలో.. ఎలా నవ్వుతానో నాకు బాగా తెలుసని తెలిపారు. నాకు ప్రకృతే దేవుడు అని సునీత కాస్త ఘాటుగానే వెల్లడించారు. ప్రస్తుతం ఈ సింగర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed