సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి

by Disha Web Desk |
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి
X

దిశ, సినిమా: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు.యూట్యూబ్ వీడియో నుంచి మొదలైన రాహుల్ ప్రయాణం ప్రపంచ ప్రఖ్యత ఆస్కార్ వేదిక వరకు చేరింది. ఇటీవల కొన్ని చిత్రాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడి వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రకుల్ దగ్గరుండి ఈ పెళ్లి పనులు చూసుకున్నాడు. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: భర్త ఉన్నా లేనట్లే.. వైరల్‌గా మారిన ప్రియమణి ఎమోషనల్ పోస్ట్‌!


Next Story

Most Viewed