సింగర్ చిన్మయి ఎమోషనల్ పోస్ట్.. అమ్మపై ట్రోల్స్.. అలాంటి వారిని ఎందుకు వదిలేస్తారంటూ నెటిజన్లకు కౌంటర్

by Mallepaka Hamsa |   (  Updated:2024-05-21 10:10:12  IST  )

టాలీవుడ్ సింగర్ చిన్మయి గత కొద్ది కాలంగా పాటలకు పాడకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

సింగర్ చిన్మయి ఎమోషనల్ పోస్ట్.. అమ్మపై ట్రోల్స్.. అలాంటి వారిని ఎందుకు వదిలేస్తారంటూ నెటిజన్లకు కౌంటర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ చిన్మయి గత కొద్ది కాలంగా పాటలకు పాడకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. పలు విషయాలపై తనదైన రీతిలో స్పందించి పోస్టులు పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి చేసే పోస్టులు వివాదాస్పదం కావడంతో కొందరు ట్రోల్స్ కూడా చేస్తారు. అయినప్పటికీ అలాంటివి పట్టించుకోకుండా తనకు చెప్పాలనిపించింది చెప్తుంది. ఇదిలా ఉంటే.. చిన్మయి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో వల్ల ఒక తల్లి చనిపోయిన ఘటనపై స్పందించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా నెటిజన్లపై ఫైర్ అయింది.

అసలు విషయంలోకి వెళితే.. చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్‌ బాల్కనీ నుంచి ఓ పాప కింద పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అది గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ బాలుడిని ప్రాణాలతో కాపాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారంతా తల్లిదే తప్పని పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె మే 19 ఆదివారం సూసైడ్ చేసుకుందని సమాచారం.

తాజాగా, ఈ ఘటనపై చిన్మయి స్పందిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీ ట్రోల్స్ వల్ల ఓ చిన్నారి తల్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు మీ అందరికీ సంతోషంగా ఉందా. అదే రేప్ చేసే వాళ్లపైన ఇంతగా ఎందుకు రియాక్ట్ అయి ట్రోల్స్ చేయరు. సమాజంలో రేప్ చేసే వాళ్ల కోసం.. టికెట్లు కొని మరీ హత్య, రేప్ చేసేవాళ్ల ఫర్ఫామెన్స్‌లు చూస్తారు. ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో.. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ పాపను చూసుకోండి’’ అని నెటిజన్లపై ఫైర్ అవుతూ కౌంటర్ వేసింది.

Read More..

స్కూల్ పరిసరాల్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు.. WHO కీలక మార్గదర్శకాలు విడుదల

Next Story