స్టేజ్‌పైనే సింగర్ చెంప పగలగొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్

by Disha Web Desk 9 |
స్టేజ్‌పైనే సింగర్ చెంప పగలగొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ సింగర్ అవా మాక్స్‌.. ఊహించని విధంగా ఓ అభిమాని తనపై దాడిచేయడంతో ఉలిక్కిపడ్డానంటోంది. బుధవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన సంగీత కచేరీలో తన పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ఈ క్రమంలోనే స్టేజ్‌పైకి దూసుకోచ్చిన ఓ వ్యక్తి ఆమెను బలంగా చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది దాడిచేసిన వ్యక్తిని బటయకు లాక్కెళ్లడంతో అక్కడున్న ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన గాయని.. ‘అతడు నన్ను చాలా గట్టిగా కొట్టాడు. తన చేయి నా కంటిపై తగలడంతో ఒక్కసారిగా తలతిరిగిపోయింది. కంటి లోపలి భాగంలో చిన్న గీతలు కూడా పడ్డాయి. అతను మళ్లీ నా ప్రదర్శనకు రాలేడు.. రాడు. ఈ అద్భుతమై రాత్రి నాతో గడిపినందుకు అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. కాగా సదరు వ్యక్తి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదంటూ ఆమెకు ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు.



Next Story

Most Viewed