ఎక్స్‌తో నయన్ రొమాన్స్.. కట్ లేకుండా చూసేయొచ్చు.. నెట్టింట వీడియోస్ వైరల్

by Disha Web Desk 7 |
ఎక్స్‌తో నయన్ రొమాన్స్.. కట్ లేకుండా చూసేయొచ్చు.. నెట్టింట వీడియోస్ వైరల్
X

దిశ, సినిమా : పాపులర్ హీరో శింబు-లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో 2006లో వచ్చిన సినిమా ‘వల్లవన్’. శింబు స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సంపాదించింది. కాగా ఈ సినిమాను రీరిలీజ్ చేయగా.. అన్‌కట్ వెర్షన్‌తో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. అయితే నిజానికి ఇదే మెయిన్ వెర్షన్ అని తెలుస్తోంది. గతంలో ‘వల్లవన్’ విడుదలయ్యాక ల్యాగ్ ఎక్కువగా ఉందని అనిపించిడంతో కొన్ని సీన్స్‌ను కట్ చేయాలని మేకర్స్.. థియేటర్ ఓనర్స్‌కు సూచించడంతో కత్తిరించారు. అదే ఇన్నాళ్లు టీవీలోనూ ప్రసారమైంది. అయితే ఈ మధ్య రీరిలీజ్‌కు ప్లాన్ చేయడంతో.. ఇప్పుడు అడిషనల్ సీన్స్ కూడా యాడ్ కావడంతో థియేటర్స్‌లో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ కాగా.. ఈ మూవీ శింబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం విశేషం. కాగా నయన్ ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోగా.. పాస్ట్‌లో ఈ హీరోతో డేటింగ్ చేసిందన్న గాసిప్స్ వచ్చాయి.

Next Story

Most Viewed