- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ‘సిగ్మా’..క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్
సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ ‘సిగ్మా’ (Sigma)తో రాబోతోంది.

దిశ, సినిమా: సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ ‘సిగ్మా’ (Sigma)తో రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్(Jason Sanjay) దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan) హీరో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా రూపొందుతోంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కు అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ‘మంచోడు.. మహానుభావుడు.. చెడ్డోడు రాక్షసుడు.. చూసే నీ చూపుని బట్టి, ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారుతాను’ అనే హీరో పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది.
తమన్ అందించిన దుమ్మురేపే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఎనర్జీ, ఇంటెన్సిటీని మరింత పెంచింది. డైలాగ్స్, విజువల్స్ చూస్తే సిగ్మా పూర్తిగా విజిలెంట్-హీరో జానర్‌తో ఆకట్టుకుంది. ఇది దళపతి విజయ్‌తో అనుసంధానమై ఉన్న స్పేస్ అయినప్పటికీ, జెన్-జీ టచ్‌తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విజువల్‌గా టీజర్ చాలా రిచ్‌గా, క్లాసీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ, సినిమాకు గ్రాండ్ సినీమాటిక్ ఫీల్ ఇస్తుంది.
లైకా ప్రొడక్షన్స్ మరోసారి తమ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను పెద్ద స్థాయిలో ప్రజెంట్ చేసింది. సందీప్ కిషన్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టీజర్ లో అదరగొట్టారు. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జీ—మూడు అంశాల్లోనూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. అంతర్గత సంఘర్షణ, ఆశయం, సహజ స్వభావంతో మలచబడిన పాత్రలో ఆకట్టుకున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో సుందీప్ కిషన్ రా అగ్రెషన్‌కి స్టైలిష్ స్వాగ్ ని అద్భుతంగా క్యారీ చేశారు.






