సైలెంట్‌గా మరో కొత్త సినిమా స్టార్ట్ చేసిన Sidhu Jonnalagadda..

by Kodari Anjali |   (  Updated:2023-08-10 14:05:47  IST  )

అప్పటి వరకు చిన్న చిన్న మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.

సైలెంట్‌గా మరో కొత్త సినిమా స్టార్ట్ చేసిన Sidhu Jonnalagadda..
X

దిశ, సినిమా: అప్పటి వరకు చిన్న చిన్న మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. నటనా పరంగా.. భాష పరంగా యూత్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ తొందరపడి సినిమాలను ఓకే చేయకుండా ఆలోచించి మరీ కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా కొత్త సినిమాను సైలెంట్‌గా సెట్స్​పైకి తీసుకెళ్లాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. SVCC బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక సిద్ధుకు జోడీగా శ్రీలీలను ఓకే చేసినట్లు తెలుస్తుండగా.. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ మూవీకి సీక్వెల్తో రాబోతున్నాడు సిద్ధు.

Next Story