తమిళ మల్టీస్టారర్ రీమేక్‌లో Sidhu Jonnalagadda, మాస్ మహారాజా Ravi Teja

by Disha Web Desk 10 |
తమిళ మల్టీస్టారర్ రీమేక్‌లో Sidhu Jonnalagadda, మాస్ మహారాజా Ravi Teja
X

దిశ, సినిమా: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో ఇటీవల వచ్చిన శింబు సూపర్‌హిట్ చిత్రం 'మనాడు'. ఈ మూవీ‌కి రీమేక్ కోసం 'డీజే టిల్లు' మూవీ ఫేమ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. అయితే రీమేక్ స్టోరీలైన్‌లో కొన్ని చేయాలని స్క్రిప్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న టీమ్‌ను రవితేజ కోరినట్లు సమాచారం. ఎందుకంటే.. చిత్రంలో ఒరిజినల్‌లో శింబు హీరోగా నటిస్తుండగా, ఎస్‌జె సూర్య విలన్‌గా బాగా నటిస్తున్నాడు. శింబు పాత్రలో రవితేజ నటిస్తే.. సిద్ధు పోలీస్ ఆఫీసర్(ఎస్‌జె సూర్య పోషించాడు) పాత్రలో నటించాలనేది ప్లాన్. కానీ వయస్సు రీత్యా రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. కెరీర్ పరంగా బాగా రన్ అవుతున్న దశ‌లో నెగిటివ్ పాత్రలో నటించడానికి రవితేజ సంకోచిస్తున్నాడు. అందుకే రీమేక్‌తో సంబంధమున్న స్క్రిప్ట్‌లో అవసరమైన మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో కన్విన్స్ అయితేనే రవితేజ రీమేక్‌ని తీసుకుంటాడు. లేదంటే కష్టం

Also Read...

నిఖిల్ సిద్ధార్థ్ 'SPY' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్



Next Story

Most Viewed