- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రహస్యంగా హీరోను పెళ్లి చేసుకున్న కియారా.? (వీడియో)

దిశ, సినిమా: యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, నటి కియారా అద్వానీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. కొంతకాలంగా వీరిద్దరూ డీప్ లవ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నారంటూ నానా హంగామా చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన కోసం వీరిద్దరూ ఎల్లో కలర్ లెహంగాలో కియారా, ఆకుపచ్చ షేర్వానీలో సిద్ధార్థ్ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేయగా.. కెమెరా ముందు నిలబడ్డప్పుడు సిద్ధార్థ కళ్లలో నలుసు పడింది.
దీంతో వెంటనే స్పందించిన కియారా ఆయన కళ్లలోంచి దాన్ని తొలగిస్తుండగా క్లోజ్ మూమెంట్ కనిపించింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. 'ఈ లవ్‌బర్డ్స్ ఎప్పుడో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కియారా పూర్తిగా సిద్ధార్థ్‌తో ఏకమైపోయిందని ఆమెను చూస్తే తెలిసిపోతుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.






