అప్పుల్లో కూరుకుపోయిన సిద్దూ జొన్నలగడ్డ..లోన్ తీసుకుని మ‌రీ ?

by velandi.Saikiran |

హీరో సిద్దు జొన్నలగడ్డ. త‌న వ‌ల్ల నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ముఖ్య ఉద్దేశ్యంతో... సిద్దు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌

అప్పుల్లో కూరుకుపోయిన సిద్దూ జొన్నలగడ్డ..లోన్ తీసుకుని మ‌రీ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : డీజే టిల్లు సినిమాతో బంపర్ హిట్లు అందుకున్న హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ ( Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సీన్ లో నవ్వు తెప్పించే... హీరో సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారట. పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని అతనిపై వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం జాక్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో... తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేసాడట సిద్దు జొన్నలగడ్డ.

అయితే ఆ రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేందుకు...బ్యాంక్ లో లోన్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. దాదాపు రూ.4.75 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చాడట హీరో సిద్దు జొన్నలగడ్డ. త‌న వ‌ల్ల నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ముఖ్య ఉద్దేశ్యంతో... సిద్దు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. ఇక త‌న దగ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో.. బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడట‌. ఆ అప్పు ఇంకా తెగ‌లేద‌ని స‌మాచారం. కాగా హీరో సిద్దు జొన్నలగడ్డ న‌టించిన జాక్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు.

Next Story