ఫుల్ స్వింగ్‌లో సిద్ధార్థ్.. కొత్త సినిమా ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3BHK’ సినిమాతో వచ్చి ఘన విజయం సాధించాడు.

ఫుల్ స్వింగ్‌లో సిద్ధార్థ్.. కొత్త సినిమా ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3BHK’ సినిమాతో వచ్చి ఘన విజయం సాధించాడు . మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. తాజాగా, సిద్ధార్థ్(Siddharth) ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘రౌడీ అండ్ కో’(Rowdy and Co.)పేరుతో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పాషన్ స్టూడియోస్ నిర్మస్తోంది. ఈ మూవీకి రొమాంటిక్ యాక్షన్ సినిమా ‘టక్కర్’ చేసిన కార్తీక్ జి క్రిష్ (Karthik G Krish)దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ టైటిల్ రివీల్ చేస్తూ.. ‘‘రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు.. లిమిట్ క్రాస్ చేసి పవర్ ఫుల్ పాత్రలో సిద్ధార్థ్ కనిపించబోతున్నాడు. రౌడీ మోడ్ ఆన్’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story