Katrina Kaif పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. బాధపడిన యంగ్ హీరో

by Chukka Sudharani |   (  Updated:2023-05-19 11:37:40  IST  )

Siddhant Chaturvedi reacts to becoming 'sad' after Katrina Kaif got married to Vicky Kaushal

Katrina Kaif  పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. బాధపడిన యంగ్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది సహ నటి కత్రినా కైఫ్ వివాహంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కత్రిన ఇంత త్వరగా మ్యారేజ్ చేసుకోవడం తనకు ఇష్టం లేదన్న నటుడు.. విక్కీతో కలిసి తిరుగుతుంటే తన హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుందని చెప్పాడు. వీరిద్దరూ కలిసి నటించిన 'ఫోన్ బూత్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిన సిద్ధాంత్.. గతేడాది కత్రిన-విక్కీ పెళ్లి అభిమానులతోపాటు తనకు షాక్ ఇచ్చిందన్నాడు. అలాగే ఆమె పెళ్లికాక ముందే 'ఫోన్ బూత్' సినిమాకు సంతకం చేసినట్లు గుర్తుచేస్తూ.. పెళ్లివార్త వినగానే కొన్ని రోజులు విచారంగా ఉన్నట్లు తెలిపాడు. మొత్తానికి వారిద్దరు మ్యారేజ్ చేసుకోవడంతో తను నిరాశకు గురైనట్లు వెల్లడించిన ఆయన.. చివరగా 'ఆమె సంతోషమే నా సంతోషం' అంటూ ఫన్నీగా చెప్పి కత్రిన మొహంలో నవ్వులు పూయించాడు. ఇక 'ఫోన్ భూత్‌'లో కత్రిన దెయ్యం పాత్రలో కనిపించనుండగా.. సిద్ధాంత్, ఇషాన్ దెయ్యాలను వేటాడే క్యారెక్టర్స్ చేస్తున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 4, 2022న విడుదల కానుంది

Next Story