తెలివిగా ప్రవర్తించాలంటూ రాజ్ నిడిమోరు భార్య సెన్సేషనల్ పోస్ట్.. సమంతను ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru)గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

తెలివిగా ప్రవర్తించాలంటూ రాజ్ నిడిమోరు భార్య సెన్సేషనల్ పోస్ట్.. సమంతను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru)గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు కలిసే ఉంటుండగా.. నిత్యం పలు వెకేషన్స్‌కు సైతం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ షేర్ చేసిన ఫొటోలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరిద్దరు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. సమంత నిత్యం ఆయనతో కలిసి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండటంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అయినప్పటికీ సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. తనకు నచ్చినట్లు ఉంటూ రాజ్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

ఇక ఇటీవల దుబాయ్‌లో ఓ ష్యాషన్ షో చూడటానికి కూడా సమంత-రాజ్ కలిసి వెళ్లడం గమనార్హం. అతని చేయి పట్టుకుని మరీ సమంత వీడియోను షేర్ చేసింది. కానీ ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడింది. అయినా రాజ్ నిడిమోరు భార్య శ్యామలి (Shyamali)కనిపెట్టేసింది. తాజాగా, సమంత-రాజ్ రిలేషన్‌పై ఇండైరెక్ట్‌గా రెండు కొటేషన్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు అందులో ఏముందంటే.. తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి.. అన్యాయంగా ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టులు రాజ్-సమంత దుబాయ్ ట్రిప్ మీదనే చేసిందని అంతా చర్చించుకుంటున్నారు.

Next Story