Shubman Gill: సౌత్ హీరోయిన్ మోజులో ఉన్న ఇండియన్ క్రికెటర్

by Disha Web Desk 10 |
Shubman Gill: సౌత్ హీరోయిన్ మోజులో ఉన్న ఇండియన్ క్రికెటర్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెటర్లు , హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారం మనం ఈ రోజు నుంచి వింటున్నది కాదు. వీటిలో కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు ఎక్కుతుంటే.. మరి కొన్ని మధ్యలోనే బ్రేక్ అవుతున్నాయి. కోహ్లీ , రాహుల్, హార్దిక్ పాండ్య వీరందరూ బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే. అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ క్రికేటర్ తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మరో ఇండియన్ క్రికెటర్ , సౌత్ హీరోయిన్ మోజులో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

2019 లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్లో ఇండియన్ టీంలోకి అడుగు పెట్టిన శుభ్‌మ‌న్ గిల్ , చిన్న వయస్సులోనే డబుల్ సెంచరీ చేసి రికార్డును సృష్టించాడు. తన లేటెస్ట్ క్రష్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపోయేలా చేశాడు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ రష్మిక మందాన అంటే చెప్పకనే చెప్పేశాడు. ఇది విన్న రష్మిక అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం పై వెంటనే స్పందించిన శుభ్‌మ‌న్ గిల్ అసలు ఈ విషయం నేనెక్కడ చెప్పానో కూడా గుర్తులేదని కొట్టి పారేసాడు.



Next Story