- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shruti Haasan: మేమిద్దరం దానికోసమే బతుకుతున్నామంటున్న శృతి హాసన్!
by Phanindra |
ప్రియుడు శంతను హజారికా తన జీవితంలోకి రావడం లక్కీగా ఫీల్ అవుతున్నానంటోంది శృతి హాసన్.

X
దిశ, సినిమా: ప్రియుడు శంతను హజారికా తన జీవితంలోకి రావడం లక్కీగా ఫీల్ అవుతున్నానంటోంది శృతి హాసన్. ఇటీవలే ‘సలార్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ముంబై వచ్చిన నటి.. వీకెండ్ స్పెషల్‌గా డిన్నర్ కోసం బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లినట్లు తెలిపింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ తన అలవాట్లు, ఇష్టాల గురించి చెప్పుకొచ్చింది. ‘బయటకు వెళ్లి ఫుడ్ తినడం నాకు చాలా ఇష్టం. నేను, శంతను తినడం కోసమే బతుకుతుంటాం. తినేటప్పుడు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం. శంతను కూడా నాలాగే భోజన ప్రియుడుకావడం ఆనందంగా ఉంది. అతడు నాకు దక్కడం అదృష్టంగా భావిస్తా’ అంటూ ప్రియుడిని పొగిడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






