నాలో అందమైన మార్పు తెచ్చింది ఆ చిత్రమే.. శ్రుతి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |
నాలో అందమైన మార్పు తెచ్చింది ఆ చిత్రమే.. శ్రుతి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ శ్రుతిహాసన్ ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తనకు సంబంధించిన ఫొటోలతో పాటు 'ది టేల్ ఆఫ్ ప్రిన్సెస్ కగుయా' యానిమేషన్ చిత్ర ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్న ఆమె.. లైఫ్ అంటే ఓ కల లాంటిదని చెప్పుకొచ్చింది. 'జీవిత కాలాలు క్రమంగా వచ్చిపోతుంటాయి. కానీ ఏదో ఒకరోజు ఇదంతా కలగా మిగిలిపోతుంది. నాలో ఏదో మార్పుతెచ్చిన ఈ అత్యంత అందమైన చిత్రాన్ని నాకు పరిచయం చేసినందుకు శంతను హజారికాకు ధన్యవాదాలు' అంటూ బాయ్‌ఫ్రెండ్‌ను పొగిడేస్తూ క్యాప్షన్ జోడించింది.

ఇక ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శ్రుతి 'కేజీ ఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ 'సలార్' చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'ఎన్బీకే 107' చిత్రాల్లోనూ నటిస్తోంది.

Also Read : నా జీవితంలో అవన్నీ చీకటి రోజులే : డివోర్స్‌పై రుబీనా

Next Story

Most Viewed