తండ్రి కమల్ హాసన్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమైన శృతి హాసన్..!

by Disha Web Desk 9 |
తండ్రి కమల్ హాసన్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమైన శృతి హాసన్..!
X

దిశ, సినిమా: సీనియర్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న నటి శృతి హాసన్. నటనతోపాటు మ్యూజిక్‌లో కూడా ప్రావీణ్యం ఉన్న ఆమె.. ఇప్పటి వరకు రెండు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయగా.. తాజాగా మూడో ఆల్బమ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ కమల్‌ హాసన్‌‌తో కలిసి చేస్తోంది శృతి. ఈ విషయాన్ని దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో కమల్‌ స్వయంగా వెల్లడిరచాడు. ఇక ఈ ఆల్బమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed