మొదటి సినిమాకు ఐదు లక్షలు తీసుకున్న Sree Leela.. ఇప్పుడు గంటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

by Disha Web Desk 9 |
మొదటి సినిమాకు ఐదు లక్షలు తీసుకున్న Sree Leela.. ఇప్పుడు గంటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ ఎవరంటే టక్‌మని గుర్తొచ్చే పేరు శ్రీ లీల. ‘పెళ్లి సందడి’ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ నటి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ లీల మొదటి సినిమా ‘పెళ్లి సందడి’కోసం కేవలం రూ.5 లక్షలు పారితోషికం తీసుకుంటే రవితేజ ‘ధమాకా’కు రూ.50 లక్షలు డిమాండ్ చేసింది. త్వరలో విడుదల కానున్న రామ్ ‘స్కంద’కు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా తీసుకుందట. ఆమె చేస్తున్న వరుస సినిమాల్లో ఒక సినిమా కోసం ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇక నుంచి ఆమె ఒప్పుకునే ప్రాజెక్ట్‌లకు సుమారు రూ.8 కోట్ల వరకు డిమాండ్ చేయనుందట.

ఇదిలావుంటే శ్రీ లీల మూవీస్‌తో పాటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళ్తుంది. అందుకోసం ఆమె సుమారు కోటి రూపాయల వరకు తీసుకుంటుందట. కానీ ఆ షాపింగ్‌ మాల్‌ కార్యక్రమంలో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఆ లెక్కన ఒక నిమిషానికి రూ.10 లక్షలు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లే. వీటితోపాటు ఆమెకు అయ్యే ఫ్లైట్‌ ఖర్చులతో పాటు హోటల్‌ రూమ్స్‌ అన్నీ షాపింగ్‌ మాల్‌ నిర్వాహుకులే ఏర్పాటు చేస్తున్నారట. దీంతో శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Geetha Madhuri ని బెడ్రూమ్‌కు పిలిచిన ప్రొడ్యూసర్.. ఏం చేసిందో తెలుసా?



Next Story

Most Viewed