Stree 2: ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన శ్రద్ధా కపూర్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘స్త్రీ 2’

by sudharani |
Stree 2: ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన శ్రద్ధా కపూర్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘స్త్రీ 2’
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘స్త్రీ’. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రిలీజైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు రాబట్టింది. అయితే.. మొదటి భాగంలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈ సినిమా ‘స్త్రీ 2’ తెరకెక్కుతుంది. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ మూవీపై మరన్ని అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధా కపూర్ మూవీ.. ప్రభాస్ ‘కల్కి’ రికార్డులను బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది.

‘స్త్రీ 2’ ఆగస్టు 15 రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో.. ‘ఫైటర్’, ‘కల్కి 2898ఏడీ’ల అడ్వాన్స్ బుకింగ్స్‌ల కలెక్షన్లను దాటేసి.. ఇప్పటి వరకు రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటినట్లు ప్రకటించారు చిత్ర బృందం. ఈ హవా ఇలాగే కొనసాగితే.. తొలిరోజు కలెక్షన్లు కూడా ఈ సినిమాలను దాటేయడం ఖాయమని చెబుతున్నారు బాలీవుడ్ సినీ పండితులు.



Next Story

Most Viewed