డిసెంబర్ బరిలో శ్రద్ధాదాస్ సినిమా..అదృష్టం కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-25 01:37:52  IST  )

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

డిసెంబర్ బరిలో శ్రద్ధాదాస్ సినిమా..అదృష్టం కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’(trikaala) సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్(Shraddha Das), మాస్టర్ మహేంద్రన్(Master Mahendran), అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం విశేషం. ‘త్రికాల’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. ఇక మరో వైపు ప్రమోషన్స్ కార్యక్రమాల్ని కూడా పెంచే పనిలో పడ్డారు. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ క్రిస్మస్ సందర్భంగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ డిసెంబర్ బరిలోకి శ్రద్ధాదాస్ సినిమా కూడా ఉండటం గమనార్హం. వాటితో పోటీ పడి అదృష్టం కలిసొచ్చి హిట్ అవుతుందా? లేదా అనేది చూడాలి.

Next Story