Shraddha - Aditya Roy: మరోసారి రొమాన్స్ చేయబోతున్న హిట్ జోడీ..? వైరల్ అవుతున్న న్యూస్..!

by Gugulothu.Kavitha |

ఇండస్ట్రీలో హిట్ పెయిర్‌గా అనిపించుకున్న జంటల్లో శ్రద్ధా కపూర్- ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఒకరు.

Shraddha - Aditya Roy: మరోసారి రొమాన్స్ చేయబోతున్న హిట్ జోడీ..? వైరల్ అవుతున్న న్యూస్..!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో హిట్ పెయిర్‌గా అనిపించుకున్న జంటల్లో శ్రద్ధా కపూర్- ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఒకరు. వీరిద్దరు ‘ఆషీకీ-2’, ‘ఓకే జాను’ వంటి సినిమాల్లో జంటగా నటించి ఆన్ స్క్రీన్‌ సూపర్ జోడి అనిపించుకున్నారు. మరీ ముఖ్యంగా ‘ఆషీకీ-2’ సినిమాలోని ‘అన్నింటా తనే ప్రాణం.. ఆ ప్రాణమే నా మౌన స్వరం’ అని సాగే పాటలో తమ యాక్టింగ్‌తో ఫుల్ మార్కులే కొట్టేశారు. ఈ క్రమంలో శ్రద్ధా, ఆదిత్య రాయ్‌లకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరోసారి స్క్రీన్ పై రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి ఈ జంటతో ముచ్చటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓ మంచి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తుంది. కాగా ముచ్చటగా మూడోసారి కలిసి రాబోతున్న ఈ హిట్ కాంబినేషన్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story