ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో హింసను చూపిస్తున్నారు.. హాట్ టాపిక్‌గా మారిన రాధికా ఆప్టే కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-12 09:33:45  IST  )

ఇండియన్ సినిమాల్లో హింస అధికమైపోతుందన్న అంశంపై నటి రాధికా ఆప్టే (Radhika Apte)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో హింసను చూపిస్తున్నారు..  హాట్ టాపిక్‌గా మారిన రాధికా ఆప్టే కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండియన్ సినిమాల్లో హింస అధికమైపోతుందన్న అంశంపై నటి రాధికా ఆప్టే (Radhika Apte)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు బోల్డ్ పాత్రలు, కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాధికా.. గత ఏడాది నుంచి మాత్రం సినిమాలకు కొంత దూరంగా ఉంటోంది. తాను చూసే కంటెంట్, స్క్రిప్టుల ఎంపికపైనా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా చేసన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘నిత్యం తెరపై హింసను చూపిస్తూ, అదే వినోదమని చెప్పడం చాలా ప్రమాదకరం. ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో ఊహించలేని స్థాయి హింసను చూపిస్తున్నారు. అది నన్ను తీవ్రంగా కలచివేస్తోంది.

చిన్న పిల్లలూ కూడా ఈ కంటెంట్‌కు చాలా సులభంగా ఎక్స్‌పోజ్ అవుతున్నారు. దీనిపై అందరం ఒక్కసారైనా ఆలోచించాలి’’ అని పేర్కొంది. తాను ఫ్యామిలీ ప్రారంభించాలని ఆలోచించే ఈ దశలో.. ఇలాంటి వాతావరణం మరింత భయపెడుతోందని కూడా ఆమె చెప్పింది. ఇలాంటి ప్రపంచంలో తన బిడ్డను పెంచాలనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే దర్శకుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉందని, కథ చెప్పడమే లక్ష్యం అయితే హింసను రెప్పపాటులో చూపడం అవసరం లేదని రాధికా స్పష్టం చేసింది. ‘‘ఒక హంతకుడి కథ చెప్పాలంటే.. వాడు చేసే హత్యలను క్లియర్ షాట్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు. అతని మనస్తత్వం, నేపథ్యం, కథ విశ్లేషణ – ఇవన్నీ కూడా హింస లేకుండా చెప్పవచ్చు.

కానీ ఇవాళ చాలామంది దర్శకులు హింసను స్టైల్‌గా చూపించే దిశగా వెళుతున్నారు. అది నన్ను అసహనానికి గురి చేస్తోంది’’ అని ఆమె అభిప్రాయపడింది. అలాగే, హింసను చూపడం వల్ల ప్రేక్షకుల భావోద్వేగాలపై పడే ప్రభావం గురించి కూడా ఆమె వివరించింది. ‘‘హింసను ఎక్కువగా చూసే కొద్దీ.. మన సంభాషణలు, మన తీరు, మన ప్రవర్తన కూడా ప్రభావితం అవుతుంది. ఇది ఒక సైకాలజికల్ విషయం. ఈ సినిమాల వల్లే ఎవరికైనా హింసాత్మక అవతారం రావాలి అని కాదు. కానీ మన మైండ్‌కు ఇవ్వబడే ఇన్‌పుట్ చాలా ముఖ్యం. మనం ఏం చూస్తామో.. మన ఆలోచనలలో, మనం చేసే పనిల్లో ఆ ప్రభావం చూపుతుంది’’ అని అన్నారు.

Next Story