- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తలైవర్-173’ విషయంలో షాకింగ్ ట్విస్ట్.. అయోమయంలో సూపర్ స్టార్ అభిమానులు!
వరుసగా దర్శకులు మారుతుండటంతో సినిమా అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అని అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అసలు ఈ ప్రాజెక్ట్ వస్తుందా? లేదా అని అయోమయంలో ఉన్నారు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు పెరుగుతున్నా తన వేగాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న తలైవర్, తన 173వ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో పెట్టారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట ఈ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్కవర్తి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు సుందర్ సి పేరు కూడా వినిపించినా, ఆయన కూడా ఈ రేసులో లేరు. ఇలా వరుసగా దర్శకులు మారుతుండటంతో సినిమా అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అని అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అసలు ఈ ప్రాజెక్ట్ వస్తుందా? లేదా అని అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఓ మై కడవులే’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికే రజినీకాంత్‌కు ఒక అద్భుతమైన కథను వినిపించానని, అది సూపర్ స్టార్‌కు బాగా నచ్చిందని చెప్పారు. అశ్వత్ చెప్పిన కథలోని కొత్తదనం, ఆయన మేకింగ్ స్టైల్ రజినీని ఫిదా చేశాయట. దీంతో తలైవర్-173 బాధ్యతలను అశ్వత్‌కే అప్పగించాలని మేకర్స్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవైపు కొత్త దర్శకుడి రాకతో సినిమాపై ఆసక్తి పెరిగినా, మరోవైపు ఈ మార్పులు చూస్తుంటే ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రజినీకాంత్ ఎనర్జీకి, అశ్వత్ మరిముత్తు కొత్త ఆలోచనలు తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా.. కమల్ హాసన్ నిర్మిణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






