షాకింగ్ న్యూస్.. మొదలైన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పనులు.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందిగా!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit)అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

షాకింగ్ న్యూస్.. మొదలైన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పనులు.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit)అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవల ‘భైరవం’ (Bhairavam)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక నారా రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా నారా రోహిత్, హీరోయిన్ సిరీ లేళ్ల (siree lella)ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ప్రేక్షకులంతా అడిగినప్పటికీ సమాధానం చెప్పలేదు.

ఈక్రమంలో.. తాజాగా, నారా రోహిత్‌కు కాబోయే భార్య సిరీ లేళ్ల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైనట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పసుపు దంచి పెళ్లి పనులు మొదలెట్టిందీ హీరోయిన్. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక వీరిపెళ్లికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సమాచారం. పెళ్లి డేట్ అనౌన్స్ చేయనప్పటికీ అంతా అక్టోబర్ చివర్లో చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. గత ఏడాది అక్టోబర్ నెలలో నిశ్చితార్థం చేసుకున్న వీరు అదే రోజు పెళ్లి చేసుకుంటారని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story