- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. NBK-111 నుంచి స్టార్ బ్యూటీ అవుట్..! కారణం ఏమిటంటే..?
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మాస్ సినిమా రూపొందనుంది.

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మాస్ సినిమా రూపొందనుంది.’ఎన్.బి.కె 111′(NBK 111) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయనతార నటిస్తుండగా.. ఈ సారి బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ మలినేని బాలయ్యతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ దశలోనే భారీ బడ్జెట్ అవుతుందట. దీంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా మలినేని మళ్లీ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. మరోవైపు నిర్మాతలు కాస్ట్ కటింగ్ పనులు కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నయనతారని ఈ ప్రాజెక్టు నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే.. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఆమె ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ను తీసుకుంటే.. బడ్జెట్ రూ.6 కోట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారట. మరి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read More..
‘మన శంకరవరప్రసాద్ గారు’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్






