- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన శంకరవరప్రసాద్ గారు’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా.. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. జనవరి 12న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. నిన్న తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్ లో ట్రైలర్ ను విడుదల చేయగా.. 2 నిమిషాల 40 సెకన్ల ట్రైలర్లో చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో అలరించారు. వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ నుంచి వరుసగా 9 రోజులపాటు నాన్ స్టాప్ ప్రమోషన్ టూర్ చేస్తామని చిత్రయూనిట్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇదే జోష్ తో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కవర్ చేస్తూ.. నెల్లూరు, వైజాగ్, తాడేపల్లిగూడెం, అనంతపురం, హైదరాబాద్, వరంగల్, బెంగళూరులో టూర్ నిర్వహించనున్నారు.
తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. సంక్రాంతి జోష్ ను డబుల్ చేసేందుకు జనవరి 7వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రకటనలో వేదిక ఎక్కడో చెప్పకపోవడంతో అభిమానులు.. వేదిక అడ్రస్ కూడా చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శశిరేఖ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. విక్టరీ వెంకటేశ్ కూడా స్పెషల్ గెస్ట్ గా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మెగా - వెంకీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.






