షాకింగ్ న్యూస్.. అతడిని రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత.. ముహూర్తం కూడా ఫిక్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

షాకింగ్ న్యూస్.. అతడిని రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత.. ముహూర్తం కూడా ఫిక్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటీస్ వ్యాధి రావడంతో కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరం అయింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సామ్ నిర్మాతగా ‘శుభం’ (shubham)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలోనూ నటించి మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ భామ గత కొద్ది కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల సమంతనే స్వయంగా ఆయనతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఒక ఫొటోలు సామ్ రాజ్ భుజంపై చేయి వేసి, ఇద్దరు అప్యాయంగా నవ్వుకుంటూ ఉండటం చూసిన నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. ఇక వీరి డేటింగ్ విషయంపై రాజ్ నిడిమోరు భార్య సైతం ఇండైరెక్ట్‌గా పలు పోస్టులు చేస్తుండటంతో సమంతపై విమర్శలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం.. సమంత, రాజ్ నిడిమోకు పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు అక్టోబర్ 6న ఏడడుగులు వేయనున్నట్లు టాక్.

ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలైపోయినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. అయితే అదే డేట్‌ను ఫిక్స్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సామ్, చైతు పెళ్లి కూడా అదే రోజున జరగడంతో ఈ విషయంపై నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ పెళ్లిని అంత గ్రాండ్‌గా కాకుండా చర్చిలో ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా సమంత రెండోసారి వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఇందుకు సంబంధించిన పుకార్లు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

Next Story